TG: బక్రీద్‌ పర్వదినం సందర్భంగా పటిష్ట భద్రత

TG: బక్రీద్‌ పర్వదినం సందర్భంగా పటిష్ట భద్రత
వెయ్యి మంది పోలీసులతో పటిష్ట భద్రత... 60కిపైగా చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు

త్యాగానికి ప్రతీకగా ముస్లిం సోదరులు జరుపుకొనే బక్రీద్ పర్వదినం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఎలాంటి అవాంఛనీయ ఘనటలు, అసౌకర్యం కలగకుండా ముందుకు వెల్తున్నారు. త్యాగానికి గుర్తుగా జరుపుకునే బక్రీద్‌ రోజున ఖుర్బానీ...అంటే మాంసాన్ని దానం చేయడం బక్రీద్ ప్రత్యేకత. నేడు బక్రీద్ సందర్భంగా సుమారు 1000మంది పోలీసులతో కట్టుదిట్టమై భద్రత ఏర్పాటు చేయున్నారు. మరోవైపు ప్రత్యేక ప్రార్ధనలు జరిగే మీరాలం ఈద్గా పరిసప్రాంతాల్లో ట్రాఫిక్ అంక్షలు విధించనున్నారు.


హైదరాబాద్ పాత బస్తీ లో బక్రిద్ సందర్భం పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయన్నారు.సుమారు 1000 మంది పోలీసులు విధుల్లో ఉండనున్నారు. ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించే మీరాలం ఈద్‌గా వద్ద సైతం ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయున్నారు. ప్రార్ధనలకు సుమారు 30వేల మందికి పైగా హజరయ్యే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బక్రీద్ కోసం ఇప్పటికే అన్ని శాఖల అధికారులు, మత పెద్దలతో సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి సమావేశం నిర్విహించారు. పశువులను తరలించే వాహనాలను తనిఖీ చేసేందుకు హైదరాబాద్ చుట్టుపక్కల 23, కమిషనరేట్ పరిధిలో 60కి పైగా చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. బక్రీద్ రోజు జంతువుల వ్యర్ధాలను తరలించేందుకు అదనపు వాహనాలను ఏర్పాటు చేయాలని జిహెచ్ఎంసి ని కోరారు. వ్యర్ధాలను వేసేందుకు ప్లాస్టిక్ బ్యాగులను అందిస్తున్నట్లు తెలిపారు. మీరాలం ఈద్గా వద్ద ప్రార్ధనల ఏర్పాట్ల కోసం జిహెచ్ఎంసి వక్ఫ్ బోర్డు సహకారంతో ముందుకు వెళుతున్నారు.

బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. పాత బస్తీలోని పలు రోడ్లపై వాహనాల రాకపోకలను ఆపేయనున్నారు. ముస్లింల ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో ట్రాఫిక్ ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించనున్నట్లు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు మీరాలం ఈద్గా ప్రాంతంలో వాహనాలను వేరే మార్గాలకు మళ్ళిస్తున్నట్లు వివరించారు. బహదూర్‌పురా క్రాస్‌ రోడ్ మీదుగా ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల మధ్య పురానాపూల్‌, కామాటిపురా, కిషన్‌బాగ్‌ వైపు నుంచి ఈద్గాకు ప్రార్థనల కోసం వచ్చే వారిని మాత్రమే అనుమతించనున్నారు. జూ పార్కు, మసీద్‌ అల్హా హో అక్బర్‌ ఎదురుగా వారి వాహనాల పార్కింగ్ కు ఏర్పాట్లు చేశారు.

Tags

Next Story