జీ-20 సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత : కిషన్‌ రెడ్డి

జీ-20 సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత : కిషన్‌ రెడ్డి
ఈ సమావేశాల్లో 46సెక్టార్లకు సంభందించిన చర్చజరుగుతోందన్నారు

జీ-20 కోసం దేశంలో జరుగుతున్న సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ సమావేశాల్లో 46సెక్టార్లకు సంబంధించిన చర్చ జరుగుతోందన్నారు. 75శాతం గ్లోబల్ ట్రేడ్ జీ20 దేశాల నుంచి జరుగుతుంది. ఈ నెల 15నుంచి 17వరకు హైదరాబాద్ వేదికగా జీ20 దేశాల వ్యవసాయ శాఖ మంత్రులు పాల్గొంటారు. ఇక్రిశాట్ హైదరాబాద్ లో జీ20 లో భాగంగా నిర్వహించే వ్యవసాయ సమావేశాల్లో పాల్గొంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఈ సమావేశంలోపాల్గొంటాయని కిషన్‌ రెడ్డి వెల్లడించారు. ఆహార భద్రత, పౌష్టికాహారం కోసం సుస్థిర వ్యవసాయం, వాతావరణం మార్పు తట్టుకునేలా పంటలు పండించడం పై చర్చలు ఉంటాయని తెలిపారు.

ఆహారం కోసం ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం పై కూడా చర్చిస్తారన్నారు. టూరిజం చివరి సమావేశాలు జూన్ 19,20,21,22తేదీల్లో గోవాలో జరుగుతాయన్నారు. గోవా రోడ్ మ్యాప్ పేరుతో డ్రాఫ్ట్ ను జీ20 మంత్రుల సమావేశంలో తీర్మానం పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని కిషన్‌ రెడ్డి వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story