గద్దర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కేఏ పాల్

గద్దర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కేఏ పాల్
గద్దర్ తో కొత్త పార్టీ పెట్టించడం వెనక తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి హస్తముందని అన్నారు

ప్రజాశాంతి పార్టీ నుంచి గద్దర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకుగాను పీఎస్పీ నుంచి అధికారిక లేఖ విడుదలైంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ప్రజాశాంతి పార్టీ జనరల్ సెక్రటరీ మమతా రెడ్డి పేరుమీద గద్దర్ సస్పెన్షన్ లెటర్ రిలీజ్ అయింది. బుధవారం గద్దర్ ఢిల్లీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కొత్త పార్టీ పెట్టడం సరికాదని అన్నారు కేఏ పాల్. గత సంవత్సరం అక్టోబర్ 5న తన ప్రజాశాంతి పార్టీలో గద్దర్ చేరారని అన్నారు.

గద్దర్ తో కొత్త పార్టీ పెట్టించడం వెనక తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి హస్తముందని అన్నారు కేఏ పాల్. రేవంత్ రెడ్డి విభజించి అధికారంలోకి రావాలనుకుంటున్నారని చెప్పారు. ఓబీసీలు, ఎస్టీ, ఎస్టీలు ఈ విషయాన్ని గ్రహించాలని గద్దర్ నిజస్వరూపాన్ని తెలుసుకోవాలని ఆయన కోరారు. తెలుగు రాష్ట్రాలను కాపాడటానికి, అభివృద్ది చేసేందుకు కుల రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ముందుకురావాలన్నారు.

గద్దర్ ప్రజా పార్టీ పేరుతో గద్దర్ కొత్తపార్టీ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను ఢిల్లీలోని ఎన్నికల అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. మీడియాతో మాట్లాడిన గద్దర్ రానున్న ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ చేయనున్నట్లు తెలిపారు. కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణను... కుళ్లు తెలంగాణగా మార్చారని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story