Ganesh Laddu : వేలం పాటలో గణేశ్ లడ్డు.. బాలాపూర్‌ని మించిపోయింది..

Ganesh Laddu: బాలాపూర్ లడ్డూ 24 లక్షల రూపాయల రికార్డ్ ధరకు కొన్నారు. కాని, హైదరాబాద్ సన్‌సిటీలో బాలాపూర్ లడ్డూ కంటే మూడింతల ధర పలికింది. బండ్లగూడ జాగీర్ పరిధిలోని కీర్తి రిచ్‌మాండ్ విల్లాలో గణేషుడి లడ్డూ ఏకంగా 60 లక్షల 80వేల రూపాయలు పలికింది.
వినాయక లడ్డూ వేలం పాట ఇలా అరకోటి దాటడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లడ్డూ వేలం పాటలో వచ్చిన 60 లక్షల రూపాయలను సమాజ సేవ కోసం వినియోగిస్తామని విల్లా వాసులు చెబుతున్నారు. ఆర్‌వి దియా ఛారిటబుల్ ట్రస్ట్ చేపట్టిన వార్షిక ఫండ్ రైజర్ యాక్టివిటీలో భాగంగా ఈ వేలం జరిగింది.
రెసిడెన్షియల్ కమ్యూనిటీ నేతృత్వంలోని ఛారిటీ గ్రూప్ వారి రోజువారీ కార్యకలాపాలలో స్వచ్ఛంద సంస్థలకు మద్దతునిచ్చే లక్ష్యంతో అనేక క్రౌడ్ ఫండింగ్ కార్యకలాపాలలో పాలుపంచుకుంది. ట్రస్ట్ యొక్క ప్రారంభ వాలంటీర్లలో రిచ్‌మండ్ విల్లాస్ కమ్యూనిటీకి చెందిన పొరుగువారు, సీనియర్ సూపర్-స్పెషలిస్ట్ వైద్యులు, సీరియల్ వ్యవస్థాపకులు, నిపుణులు, వ్యాపారవేత్తలు, వ్యవసాయదారులు, సామాజిక కార్యకర్తలు మరియు సీనియర్ సిటిజన్‌లు ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com