GANESH VISARJAN: జై బోలో గణేష్ మహరాజ్‌కి..

హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. భక్తులు, సందర్శకులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి వేదికపై నుంచి భక్తులకు అభివాదం చేశారు. ‘గణపతి బప్పా మోరియా’ అంటూ భక్తులతో కలిసి నినాదాలు చేశారు. క్రేన్ నెం.4వద్ద నిమజ్జనాలను పరిశీలించారు. నిమజ్జనం ఏర్పాట్లను కలెక్టర్ హరిచందన సీఎంకు వివరించారు. ముఖ్యమంత్రి అయి ఉండి గణేష్ నిమజ్జన వేడుకల్ని స్వయంగా పరిశీలించడానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి భక్తులతో కలిసి నినాదాలు చేయడం అందర్నీ ఆకట్టుకుంది. ప్రతిష్టాత్మక గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను హైదరాబాద్ కలెక్టర్ హరిచందన సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.
గణేశ్ నిమజ్జనాల సందర్భంగా హుస్సేన్ సాగర్ వద్దకు సీఎం వచ్చి ఏర్పాట్లను పరిశీలించడం పట్ల భాగ్యనగర్ ఉత్సవ్ సమితి ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
డీజే బాణీలకు పోలీసుల స్టెప్పులు
డీజేలు, బ్యాండ్లు, కోలాటాలు, డప్పుల మోతలు, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ భక్తులు భారీగా ట్యాంక్‌బండ్ వైపు తరలివస్తున్నారు. శోభాయాత్రలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొని వినాయకుడి నిమజ్జనాన్ని పండగలా మార్చుతున్నారు. డీజే పాటల బాణీలకు పోలీసు సిబ్బంది ఊరేగింపులో పాల్గొని డ్యాన్స్ చేశారు. ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రలో ఏసీపీ సంజయ్ నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆయనతో పాటు పలువురు పోలీస్ అధికారులు కూడా భక్తులతో కలిసి డ్యాన్స్ చేస్తూ, అక్కడి వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు. భక్తుల మధ్యే కలిసిపోయి, ఆనందంగా స్టెప్పులు వేస్తున్న పోలీసుల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీసుల స్టెప్పులతో ఫుల్ జోష్ కనిపించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com