Gangavva: ఫ్లైటెక్కిన గంగవ్వ.. నెటిజన్ల ప్రశంసలు..

Gangavva: ఫ్లైటెక్కిన గంగవ్వ.. నెటిజన్ల ప్రశంసలు..
Gangavva: ఆమె అమాయకత్వం, ఆమె మాటలు.. ఆమెను ఓ సెలబ్రెటీని చేసింది.

Gangavva: ఆమె అమాయకత్వం, ఆమె మాటలు.. ఆమెను ఓ సెలబ్రెటీని చేసింది. గ్రామీణ ప్రాంతంలో పెరిగిన గంగవ్వని ఓ యూట్యూబర్ సోషల్ మీడియాకు పరిచయం చేశాడు. దినసరి కూలీ గంగవ్వ తెలంగాణ గ్రామీణ జీవన, సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉంటుంది ఆమె ఆహార్యం. మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆమె పేరు ప్రపంచానికి తెలిసింది. ఛానెల్ పుణ్యమా అని ఆమె తన ఊరుని దాటి పట్నం చేరుకుంది.. ప్రముఖ సెలబ్రెటీలతో, సినీ తారలతో మాటా మంతీ నడిపింది. ఇప్పుడు గంగవ్వ ఏకంగా ఫ్లైట్ ఎక్కే ఛాన్స్ కొట్టేసింది. 62 ఏళ్ల వయసులో ఆమె కారు కూడా ఎక్కుతానని కలగని ఉండదు. అలాంటిది ఫ్లైట్ ఎక్కింది.

యూట్యూబర్ చేసిన ఈ మంచి పనికి నెటిజన్స్ నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. మీరు చాలా మంచి పని చేస్తున్నారు. గంగవ్వను ప్రశంసించారు. వ్యవసాయ కూలీగా ఉన్న గంగవ్వ 2019లో మల్లేశం అనే తెలుగు సినిమాతో చిత్ర రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌లోను ఓ చిన్న పాత్ర పోషించింది. తెలుగు రియాలిటీ టీవీ షో బిగ్ బాస్‌లో 19 మంది ఇంటి సభ్యులలో ఒకరిగా నిలిచి కొన్ని రోజులు సందడి చేసింది.

Tags

Read MoreRead Less
Next Story