GHMC : ఎర్రమంజిల్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత

X
By - Vijayanand |22 Feb 2023 2:41 PM IST
రామకృష్ణా నగర్‌లోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన కట్టడాలను అర్ధరాత్రి భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేశారు
హైదరాబాద్ ఎర్రమంజిల్‌లో అక్రమ కట్టడాలను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేశారు. రామకృష్ణా నగర్ కాలనీలో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన కట్టడాలను అర్ధరాత్రి భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేశారు. అయితే పునరావాసం కల్పించిన తర్వాత కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి ఆందోళనకు దిగారు. విజయారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉండటానికి నిలువ నీడ కూడాలేకుండా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా..పునరావాసం కల్పించకుండా కూల్చివేతలు చేపట్టంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com