GHMC : మరో చోట బాలుడిపై కుక్కల దాడి

GHMC : మరో చోట బాలుడిపై కుక్కల దాడి
కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు

హైదరాబాద్ అంబర్‌పేటలో వీధికుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటన మరువక ముందే చైతన్య పురి మారుతీ నగర్‌లో నాలుగేళ్ల బాలుడిపై కుక్కలు దాడిచేశాయి. స్వల్ప గాయాలవడంతో తల్లిదండ్రులు సకాలంలో చికిత్స అందించారు. కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లి భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

కరీంనగర్ జిల్లాలోకుక్కలు స్వైర విహారం చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. శంకరపట్నం మండలంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతిగృహంలో సుమంత్ అనే విద్యార్థిపై దాడిచేశాయి. తీవ్ర గాయాలు కావడంలో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు వీణవంక మండలం మల్లారెడ్డిపల్లిలో బైక్‌పై వెళుతున్న యేసయ్యను కుక్కలు వెంబడించాయి. దీంతో బైక్ పై నుండి పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా కుక్కలు రెచ్చిపోయి దాడులు చేస్తున్నా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story