GHMC : వీధి కుక్కలపై... ఒక్క రోజులోనే 2 వేలకు పైగా ఫిర్యాదులు

GHMC : వీధి కుక్కలపై... ఒక్క రోజులోనే  2 వేలకు పైగా ఫిర్యాదులు
వరుస ఘటనలతో నగరవాసులు భయాందోళనకు గురవుతుందడంతో యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టారు.

హైదరాబాద్ లో వీధి కుక్కల సంచారంపై ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. వరుస ఘటనలతో నగరవాసులు భయాందోళనకు గురవుతుందడంతో యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టారు. వీధికుక్కలపై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. నగరంలో వీధికుక్కల సంచారంపై ఒక్క రోజులోనే రెండు వేలకు పైగా ఫిర్యాదులు అందడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అంబర్‌ పేట ఘటనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి.. వీధి కుక్కల దాడులు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ గైడ్ లైన్స్ జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల పరిధిలో చర్యలకు ఆదేశించారు. వీధి కుక్కల సంఖ్య పెరగకుండా నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. కుక్కలకు 100 శాతం స్టెరిలైజేషన్ చేయాలన్నారు. మాంసం దుకాణాలు, ఫంక్షన్ హాళ్ల వద్ద ఇష్టానుసారం మాంసాన్ని పడేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story