GHMC: నకిలీ ధ్రువీకరణ పత్రాలకు చెక్

GHMC: నకిలీ ధ్రువీకరణ పత్రాలకు చెక్
X
కొత్త విధానం అమలుకు గ్రీన్ సిగ్నల్... జీహెచ్ఎంసీ సాఫ్ట్‌వేర్‌కి గుడ్‌బై

నకి­లీ జనన, మరణ ధ్రు­వీ­క­రణ పత్రాల జా­రీ­ని అడ్డు­కో­వ­డం లక్ష్యం­గా రా­ష్ట్ర ప్ర­భు­త్వం కీలక ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. ప్ర­స్తు­తం జీ­హె­చ్‌­ఎం­సీ వా­డు­తు­న్న సా­ఫ్ట్‌­వే­ర్‌­ను పక్క­న­బె­ట్టి, కేం­ద్ర ప్ర­భు­త్వా­ని­కి చెం­దిన ఆఫీ­స్‌ ఆఫ్‌ ది రి­జి­స్ట్రా­ర్‌ జన­ర­ల్‌ ఆఫ్‌ ఇం­డి­యా (ఓఆ­ర్‌­జీఐ) వె­బ్‌ పో­ర్ట­ల్‌­ను వి­ని­యో­గిం­చేం­దు­కు అను­మ­తి ఇచ్చిం­ది. కొ­త్త వి­ధా­నం అమ­ల్లో­కి రా­గా­నే జనన, మరణ ధ్రు­వీ­క­ర­ణ­ల­కు ఆధా­ర్ తప్ప­ని­స­రి అవు­తుం­ది. ప్ర­స్తు­తం GHMC­లో అం­దు­తు­న్న "ఇన్‌­స్టం­ట్‌" సే­వ­ల­తో వే­లా­ది నకి­లీ ధ్రు­వీ­క­రణ పత్రా­లు చలా­మ­ణి­లో­కి వచ్చా­యి. పు­ట్ట­ని­వా­రి­కి జనన ధ్రు­వీ­క­ర­ణ­లు, బతి­కే వా­రి­కి మరణ ధ్రు­వీ­క­ర­ణ­లు సృ­ష్టిం­చి, వా­టి­ని రో­హిం­గ్యా­లు లాం­టి వి­దే­శీ అక్రమ వల­స­దా­రుల పా­స్‌­పో­ర్టు­ల­కు కూడా వా­డు­తు­న్న­ట్లు జా­తీయ దర్యా­ప్తు సం­స్థ (NIA) గు­ర్తిం­చిం­ది. దీ­ని­పై తీ­వ్ర ఆం­దో­ళన వ్య­క్తం చే­సిం­ది. ఇకపై ఓఆ­ర్‌­జీఐ వ్య­వ­స్థ­లో, ఒక­రి­కి ఒక్క­సా­రి మా­త్ర­మే ధ్రు­వీ­క­రణ పత్రం జారీ అవు­తుం­ది. తప్పు చే­సిన అధి­కా­రు­ల­పై కఠిన చర్య­లు ఉం­డ­ను­న్నా­యి. ఆసు­ప­త్రు­లు, వై­ద్యు­లు ఇచ్చే సమా­చా­రం ప్ర­కా­రం ఆన్‌­లై­న్‌­లో నమో­దు చే­సిన వి­వ­రాల పరి­శీ­లన తర్వా­తే ధ్రు­వీ­క­రణ పత్రాల మం­జూ­రు జరు­గు­తుం­ది. దీ­ని­వ­ల్ల నకి­లీ ధ్రు­వీ­క­ర­ణ­లు పూ­ర్తి­గా అదు­పు­లో­కి వస్తా­య­ని అధి­కా­రు­లు నమ్ము­తు­న్నా­రు. ఇకపై మీ­సే­వా కేం­ద్రా­ల­పై ఆధా­ర­ప­డా­ల్సిన అవ­స­రం లేదు. ఇక అధి­కా­రుల సమీ­క్ష అనం­త­రం మా­త్ర­మే ధ్రు­వీ­క­ర­ణ­లు జారీ అవు­తా­యి. భవి­ష్య­త్‌­లో ఈ గణాం­కా­లు దేశ భద్రత, జన గణ­న­కు ఉప­యు­క్తం­గా మా­ర­ను­న్నా­యి. GHMC కమి­ష­న­ర్ కర్ణ­న్‌ ఈ వ్య­వ­స్థ అమ­లు­లో చొరవ చూ­ప­డం­తో రా­ష్ట్ర ప్ర­భు­త్వం ఆమో­దం తె­లి­పిం­ది. త్వ­ర­లో­నే ఇది పూ­ర్తి­గా అమ­ల్లో­కి రా­నుం­ది.

Tags

Next Story