వరద బాధితులెవరూ మీసేవ సెంటర్లకు రావొద్దు: జీహెచ్‌ఎంసీ కమిషనర్

వరద బాధితులెవరూ  మీసేవ సెంటర్లకు రావొద్దు: జీహెచ్‌ఎంసీ కమిషనర్
X
ప్రస్తుతం బాధితుల వివరాలు, ఆధార నెంబర్ ధ్రువీకరణ

జీహెచ్‌ఎంసీ పరిధిలోని వరద బాధితులందరూ ప్రభుత్వం అందించే వరద సాయం కోసం మీసేవ సెంటర్లకు పోటెత్తుతున్నారు. అయితే ఇకపై ఎవరూ సెంటర్‌కు రావాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం అందించే ఆర్థికసాయం నేరుగా బాధితుల ఖాతాల్లోనే జమ అవుతుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. బాధితుల వివరాల ధ్రువీకరణ పూర్తయ్యాక నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ అవుతుందని ఆయన తెలిపారు. వరద సాయం కోసం బాధితులెవరూ మీ సేవ సెంటర్ల చుట్టూ తిరగొద్దని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి సాయం అందని వారి వివరాలు సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం బాధితుల వివరాలు, ఆధార నెంబర్ ధ్రువీకరణ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

Tags

Next Story