@10am update.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

@10am update.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
X

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ లీడ్‌లో కొనసాగుతోంది. మెజారిటీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. 72 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంది. టీఆర్‌ఎస్‌ 35 చోట్ల పోస్టల్‌ బ్యాలెట్‌లో లీడ్‌లో ఉంది. MIM 28 చోట్ల, కాంగ్రెస్‌ 1 స్థానంలో లీడ్‌లో ఉన్నాయి. మల్కాజ్‌గిరిలో బీజేపీకి 5 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పడ్డాయి. ఒక ఓటు తిరస్కరించారు. జాంబాగ్‌లో బీజేపీకి 2 రెండు పోస్టల్‌ ఓట్లు పడగా.. టీఆర్‌ఎస్‌కు ఒక్కటీ రాలేదు. జియాగూడ డివిజన్‌లోని 14 పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లలో బీజేపీకి 9 ఓట్లు లభించాయి. టీఆర్‌ఎస్‌కు 4 రాగా.. ఒక ఓటు చెల్లలేదు.

లంగర్ హౌస్‌లోని మొత్తం 6 పోస్టల్ బ్యాలెట్‌లలో బీజేపీకి 2, MIMకి 1, టీఆర్‌ఎస్‌ 1, ఇండిపెండెంట్‌కు 1 లభించాయి. కాచిగూడలో డివిజన్‌లో బీజేపీకి 3 పోస్టల్‌ ఓట్లు పోలవగా.. 3 ఇన్‌వాలిడ్ అయ్యాయి. నల్లకుంటలో బీజేపీకి 9 పోస్టల్‌ ఓట్లు రాగా టీఆర్‌ఎస్‌కు 2 వచ్చాయి. బాగ్ అంబర్‌పేట్‌లో బీజేపీకి ఏకంగా 10 పోస్టల్‌ ఓట్లు పోలయ్యాయి. టీఆర్‌ఎస్‌కు ఒకటి వచ్చింది. గోల్నాక డివిజన్‌లో బీజేపీకి 4, టీఆర్‌ఎస్‌కు 2 పోస్టల్‌ ఓట్లు లభించాయి.

ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్‌లో 17 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వచ్చాయి. వీటిలో టీఆర్‌ఎస్‌కు 8 , బీజేపీకి 7 ఓట్లు రాగా రెండు ఓట్లు తిరస్కరించారు. జూబ్లీ హిల్స్‌లో నమోదైన పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్‌ఎస్‌కు 1, బీజేపీకి 1, టీడీపీ 1 ఓట్లు లభించాయి. బంజారాహిల్స్‌లో కాంగ్రెస్‌ 4, బీజేపీ 3 ఓట్లు సాధించాయి. షేక్‌పేటలో టీఆర్‌ఎస్‌ 1, MIM 1 ఓటు సాధించాయి. ఫతేనగర్‌ డివిజన్‌లో ఒకే ఒక్క పోస్టల్ బ్యాలెట్‌ నమోదైందవగా అది టీఆర్ఎస్‌కు పడింది. బాలానగర్‌లో టీఆర్‌ఎస్‌కు 5 బీజేపీకి 2 పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లు వచ్చాయి.

Tags

Next Story