జీహెచ్ఎంసీ ఎన్నికలు : తొలిరోజు 20 నామినేషన్లు దాఖలు

గ్రేటర్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం జోరందుకుంటోంది. మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఎన్నికల కమిషన్.. నామినేషన్లకు ఇవాళ్టి నుంచి ఈనెల 20వరకు గడువు ఇచ్చింది. దీంతో ఎన్నికల బరిలో నిలుస్తున్న అభ్యర్ధులు...నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తొలిరోజు 20 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 17మంది అభ్యర్ధులు నామినేషన్ వేశారు. ఇందులో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి 6 నామినేషన్లు, టీడీపీ నుంచి 5నామినేషన్లు, కాంగ్రెస్ నుంచి 3 నామినేషన్లు, బీజేపీ నుంచి 2నామినేషన్లు, మరో గుర్తింపు పొందిన పార్టీ నుంచి ఒక్క నామినేషన్, స్వతంత్ర అభ్యర్ధుల నుంచి 3నామినేషన్లు దాఖలు అయ్యాయి . అన్ని GHMC సర్కిల్ కార్యాలయాల్లో నామినేషన్లను స్వీకరిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే రిటర్నింగ్ అధికారి చాంబర్‌లోకి అనుమతిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com