జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

అత్యంత ఉత్కంఠను రేపిన గ్రేటర్ పీఠం దక్కేదెవరికి? అసెంబ్లీ ఎన్నికలను తలపించిన గ్రేటర్ వార్‌లో విజయం ఎవరిని వరిస్తుంది? బల్దియా పీఠంపై ఎవరి జెండా ఎగరనుంది? ఓల్డ్ మలక్‌పేటలో రీ పోలింగ్ ముగియడంతో పలుసంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ను విడుదల చేశాయి. పలు ఆసక్తికర అంశాలతో వెలువడిన ఈ ఎగ్జిట్‌పోల్స్ ఉంత్కంఠను మరింత పెంచేశాయి. దాదాపు సర్వేలన్నీ అధికార టీఆర్ఎస్‌కే పట్టం కట్టాయి...
పీపుల్స్ పల్స్ సంస్థ సర్వే ప్రకారం...TRSకు 68 నుంచి 78 సీట్లు, BJPకి 25 నుంచి 35.... MIMకి 38-42 ,ఇక కాంగ్రెస్ 1 నుంచి 5 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య 6 శాతం ఓట్ల వ్యత్యాసం ఉంటుందని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. టీఆర్‌ఎస్‌కు 38 శాతం, బీజేపీ 32 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక ఎంఐఎం 13 శాతం.. కాంగ్రెస్ 12 శాతం, ఇతరులకు 5 శాతం ఓట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ సంస్థ వెల్లడించింది...
ఇక ఆరా సంస్థ కూడా టీఆర్ఎస్‌కే పట్టం కట్టింది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఏడు స్థానాలు అటూ ఇటూగా 78 సీట్లు రావచ్చని తెలిపింది. ఇక టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ ఐదు స్థానాలు అటూ ఇటూ గా 28 సీట్లు దక్కించుకుంటుందని తెలిపింది. మరోవైపు పాతబస్తీలో MIM తన పట్టు నిలుపుకుంటుందని ఆరా సంస్థ తెలిపింది. ఆ పార్టీ ఐదు స్థానాలు అటూ ఇటూ గా 41 సీట్లు గెలుస్తుందని... కాంగ్రెస్ పార్టీకి స్థానాలు అటూ ఇటూగా 3 సీట్ల వరకు రావచ్చని అంచనా వేసింది. ఇక ఓట్ల శాతానికి వస్తే టీఆర్ఎస్‌కు 40 శాతం, బీజేపీకి 31 శాతం , MIM కు 13 శాతం , కాంగ్రెస్‌కు 8 శాతం ఓట్లు వస్తాయని చెప్పుకొచ్చింది .
ఇక ఈ గ్రేటర్ ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావం చూపిన అంశాలను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించింది పీపుల్స్ పల్స్ సంస్థ. డబుల్ బెడ్‌రూమ్, నిరుద్యోగ సమస్య, వరదబాధితుల సాయం, ట్రాఫిక్ , రోడ్ల సమస్య, పారిశుద్ధ్యం, వంటి అంశాలు ఎన్నికలపై ప్రభావం చూపించాయని వెల్లడించింది. సిట్టింగ్ కార్పొరేటర్లపై అసంతృప్తి, వరద సాయంలో అవకతవకల వంటి అంశాలు టీఆర్‌ఎస్‌కు ఇబ్బందికరంగా మారాయని అభిప్రాయపడింది.. ఇక మజ్లిస్ తక్కువ సీట్లలో పోటీ చేయడం కూడా టీఆర్‌ఎస్‌కు కలసివచ్చిందని చెప్పుకొచ్చింది పీపుల్స్ పల్స్ సంస్థ. బీజేపీ ఆశించిన మేరకు హిందువుల ఓట్ల పోలరైజేషన్ జరగలేదని వెల్లడించింది.అయితే నగరంలో కనిపిస్తున్న సైలెంట్ వేవ్ బీజేపీకి లబ్ధి చేకూరవచ్చని అంచనా వేసింది పీపుల్స్ పల్స్ సంస్థ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com