జీహెచ్ఎంసీ ఎన్నికలు : అప్‌డేట్స్..

జీహెచ్ఎంసీ ఎన్నికలు : అప్‌డేట్స్..

*ఆర్కేపురం పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లను ప్రలోభపెడుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టీఆర్‌ఎస్‌ నేతలు అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసులు పట్టించుకోవడం లేదని అన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

*కేపీహెచ్‌బీలో సినీనటుడు రాజేంద్రప్రసాద్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. పోలింగ్‌ మందకొడిగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. యువత ఓటు వేయడానికి ముందుకు రావాలని చెప్పారు. నేతల్ని ఎన్నుకునే హక్కును కోల్పోవద్దని అన్నారు రాజేంద్రప్రసాద్‌..

*కేపీహెచ్‌బీలో బీజేపీ-టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మంత్రి పువ్వాడ అజయ్ కారును బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కేపీహెచ్‌బీ ఫోరం మాల్‌ సమీపంలో మంత్రి పువ్వాడ అజయ్‌ అనుచరులు డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అటు.. మంత్రి కారు అడ్డుకోవడంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు.

*ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ కోరారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్- 45లోని తెలంగాణ స్టేట్ ఉమెన్స్ వర్కింగ్ సొసైటీ కార్యాలయంలో కుసుమ కుమార్ కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు .

*జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో సినీహీరో విజయ్‌ దేవరకొండ ఓటు వేశారు. ప్రజలంతా బయటకు వచ్చి ఓటు వేయాలని సూచించారు. ఓటు హక్కును వినియోగించుకుని మంచి నేతల్ని ఎన్నుకోవాలని చెప్పారు.

*ఓల్డ్‌ మలక్‌పేటలో ఓటింగ్ రద్దయింది. బ్యాలెట్‌లో సీపీఐ పార్టీ గుర్తు తారుమారైంది. సీపీఐ గుర్తుకు బదులు సీపీఎం గుర్తును ముద్రించారు. కంకి కొడవలికి బదులు.. కొడవలి సుత్తె గుర్తును ముద్రించారు. దీంతో సీపీఐ నేతలు ఆందోళనకు దిగారు. ఎన్నిక ఆపివేయాలంటూ హైదరాబాద్‌ సీపీఐ సెక్రెటరీ నరసింహ డిమాండ్‌ చేశారు. దీంతో ఓల్డ్ మలక్‌పేటలో రీపోలింగ్‌ నిర్వహించే అకాశం ఉంది. ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో ౩న రీ పోలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. గుర్తులు మారడంతో 1, 2, 3, 4, 5 కేంద్రాల్లో పోలింగ్‌ రద్దు చేశారు.

*అంబర్‌పేట్‌ డీడీ కాలనీలో బీజేపీ సీనియర్‌నేత మురళీధర్‌రావు ఓటు వేశారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఓటు హక్కు ద్వారా చైతన్యం చాటాలని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story