గ్రేటర్ ఎన్నికలు : టాప్ గేర్‌లో దూసుకుపోతోన్న టీఆర్ఎస్

గ్రేటర్ ఎన్నికలు : టాప్ గేర్‌లో దూసుకుపోతోన్న టీఆర్ఎస్

టీఆర్ఎస్ టాప్ గేర్‌లో దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టే టీఆర్ఎస్ డివిజన్లు గెలుచుకోబోతోంది. బీజేపీ కేంద్ర పెద్దలు దిగొచ్చినా.. ఆ స్థాయి వేవ్ మాత్రం హైదరాబాద్‌లో కనిపించలేదు. కారు స్పీడు ముందు మిగతా పార్టీల జోరు కనిపించడం లేదు. ఇక ఎంఐఎం ఎప్పటిలాగే తన స్థానాలను నిలబెట్టుకునేలా కనిపిస్తోంది. పాతబస్తీలో తిరుగులేదని మరోసారి రుజువు చేసుకుంటోంది ఎంఐఎం.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అందరి చూపు బీజేపీ మీదే ఉంది. గ్రేటర్ పీఠంపై కూర్చుంటామని, వంద సీట్లు గెలుచుకుంటామని చెప్పినప్పటికీ.. ఫలితాలు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టే బీజేపీ సీట్ల సంఖ్య కనిపిస్తోంది. కాకపోతే, 2016లో నాలుగు సీట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి దాదాపుగా పది రెట్లు ఎక్కువ స్థానాలను దక్కించుకునేలా ఉంది. ముఖ్యంగా సిటీ శివారు ప్రాంతాల్లో బీజేపీ హవా కనిపిస్తోంది.

ఈ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేదనుకున్న కాంగ్రెస్.. తన ఉనికిని చాటుకుంటోంది. మల్కాజిగిరి నియోజకవర్గంలోని డివిజన్లలో కొన్ని సీట్లను గెలుచుకునేలా ఉంది. రేవంత్ రెడ్డి కష్టానికి తగిన ఫలితం వచ్చేలా కనిపిస్తోంది. 2016లో కేవలం రెండు సీట్లను గెలుచుకున్న కాంగ్రెస్.. మహా అయితే మరో ఒకట్రెండు సీట్లను ఖాతాలో వేసుకునేలా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story