జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. పకడ్బందీగా ఓటర్ల జాబితా తయారు చేయాలి : ఎస్‌ఈసీ

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 7న జీహెచ్ఎంసీ ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటన చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పురపాలక, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, కమిషనర్లు అరవింద్ కుమార్, లోకేశ్‌కుమార్‌లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నద్ధతపై వారితో చర్చించారు. ఎన్నికల ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించాలని సూచించారు. పకడ్బందీగా ఓటర్ల జాబితా తయారు చేయాలని ఎస్‌ఈసీ అధికారులను ఆదేశించారు.
ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 9న జీహెచ్‌ఎంసీ కమిషనర్, 10న సర్కిళ్ల వారీగా డిప్యూటీ కమిషనర్లు పార్టీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. నవంబర్ 11 వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించనునున్నారు. నవంబర్ 13న తుది జాబితాను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటనలో వెల్లడించింది. జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకమండలి గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10తో ముగియనుంది. దీంతో గడువు ముగిసేలోగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 3 నెలల ముందే తెలంగాణ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సిద్ధమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com