డిసెంబర్ 1న జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. బీజేపీలోకి భారీగా చేరికలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌తో పాటు నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 20 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అంటే మూడు రోజులు మాత్రమే నామినేషన్లు గడువు ఉంది. 21న నామినేషన్లను పరిశీలిస్తారు. ఇక 22లోపు నామినేషన్ల ఉపసంహరణకు ఎస్‌ఈసీ అవకాశం కల్పించింది.
గ్రేటర్ ఎన్నికల వేళ.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, చంద్రారెడ్డి భేటీ అయ్యారు. బుధవారం అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా వచ్చి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. అటు, కిషన్‌రెడ్డితో ఆర్టీసీ TMU నేత అశ్వద్ధామరెడ్డి కూడా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన కూడా BJPలో చేరతారని తెలుస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com