బీజేపీ 'బస్తీ నిద్ర' కార్యక్రమం

బీజేపీ బస్తీ నిద్ర కార్యక్రమం
X

బస్తీ నిద్ర కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, డివిజన్‌ ఇన్‌చార్జులతో టెలికార్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన.. దిశానిర్దేశం చేశారు. సామాన్యులతో పాటు బస్తీల్లో నిద్రించి, అక్కడి సమస్యలు తెలుసుకోవాలన్నారు. మంగళవారం తాను బస్తీ నిద్ర చేస్తానని ప్రకటించారు. ప్రజలతో నాయకులు, కార్యకర్తలు మమేకమై.. అక్కడున్న పరిస్థితులను, ప్రజల కష్టాలను తెలుసుకోవాలని సూచించారు. బీజేపీ కార్పొరేటర్లు గెలిచిన తర్వాత కూడా.. వారంలో ఒక రోజు బస్తీ నిద్ర కార్యక్రమం నిర్వహించాలని.. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచనలు చేశారు.



Tags

Next Story