జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీకి నిరసన సెగ

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీకి నిరసన సెగ
X

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసద్దుద్దీన్‌ ఒవైసీకి నిరసన సెగ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం తమకు అందలేదని మహిళలు నిలదీశారు. జాంబాగ్‌ డివిజన్‌లో MIM అభ్యర్థికి మద్దతుగా అసదుద్దీన్‌ ఒవైసీ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. అయితే తాము కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదని స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడెలా ఓట్లు అడుగుతారంటూ ప్రశ్నించారు. దీంతో అక్కడి నుంచి వెనుదిరిగారు ఒవైసీ.


Tags

Next Story