జీహెచ్ఎంసీ ఎన్నికలు : హైదరాబాద్‌కు ప్రకాశ్ జవదేకర్..

GHMC ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్... హైదరాబాద్‌కు రానున్నారు. బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. టీఆర్‌ఎస్ గత మేనిఫెస్టోపైనా చార్జ్ షీట్ విడుదల చేయనున్నారు. నేటి నుంచి రోడ్ షోలు నిర్వహించనున్నారు. స్టార్ క్యాంపెయినర్లుగా ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలను ప్రచార బరిలోకి దించనుంది. స్మృతి ఇరానీ సహా మరో ఇద్దరు కేంద్ర మంత్రులతో ప్రచారం చేయించనున్నారు.
ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రచార బరిలోకి దిగనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ క్రికెటర్, ఎంపి గౌతం గంభీర్, ఇటీవలె బీజేపీలో చేరిన సినీ నటి ఖుష్బులతో కూడా GHMC ఎన్నికల ప్రచారం చేయించేందుకు ఆహ్వానం పంపినట్లు సమాచారం. మొత్తంగా గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది కమలం పార్టీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com