గ్రేటర్‌లో వరద సాయం.. ఈసేవా కేంద్రాల్లో ఉండాల్సిన ఫామ్స్ రోడ్డుమీద..

గ్రేటర్‌లో వరద సాయానికి ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ఎన్నికల తర్వాత యధావిధిగా సాయం అందించవచ్ని స్పష్టం చేసింది. ఐతే... వరద సహాయం కోసం జనం ఈసేవా కేంద్రాల వద్ద బారులు తీరారు. అష్టకష్టాలకోర్చి జీరాక్స్ కాపీలు ఇచ్చి తమ పేరును నమోదు చేసుకున్నారు. ఐతే.. ఇంతకష్టపడి ఇచ్చిన పత్రాలు నడిరోడ్డు మీద చిత్తు కాగితాల్లా పడి ఉండటంతో జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి జిరాక్స్ కాపీలు ఇస్తే ఇలా రోడ్డుమీద పడెయ్యడం ఏంటని అధికారులను ప్రశ్నిస్తున్నారు.
వరద సహాయం కోసం బాలానగర్‌లో వందలాదిమంది ఈసేవా కేంద్రాల్లో అప్లై చేశారు. అయితే ఈసేవా కేంద్రాల్లో ఉండాల్సిన తమ ఫామ్స్ రోడ్డుమీద పడిఉండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సేవా కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అలసత్వంపై మండిపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com