GHMC Mayor : తెలంగాణ బీజేపీ నేతలపై GHMC మేయర్ ఫైర్

GHMC Mayor : తెలంగాణ బీజేపీ నేతలపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ధర్నాల పేరుతో జీహెచ్ఎంసీ కార్యాలయంపై బీజేపీ నాయకులు చేసిన దాడిన ఖండించారు. బీజేపీ కార్పొరేటర్ల సమస్యలను పరిష్కరించానని తెలిపారు. నిరసనలు తెలపడానికి ఎన్నో మార్గాలున్నా.. ప్రజల ఆస్తులను ధ్వంసం చేశారన్నారు. ఈ దాడి కార్పొరేటర్లు చేశారా..? పార్టీ అధిష్టానం చేయించిందా..? అనేది బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని మేయర్ గద్వాల విజయక్ష్మి నిలదీశారు.
జీహెచ్‌ఎంసీలో డివిజన్లకు కేటాయించిన నిధుల్ని వెంటనే నిధులు విడుదల చేయాలంటూ BJP కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. కార్యకర్తలతో కలిసి బల్దియా కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. అధికారపక్షం ఇచ్చిన ఏ హామీనీ నిలబెట్టుకోవడం లేదని విమర్శిస్తూ.. మేయర్ ఛాంబర్‌లోకి దూసుకెళ్లారు. లోపలంతా ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. BJP శ్రేణులు రెచ్చిపోయి GHMC ఆఫీస్ బయట పూలకుండీల్ని పగలగొట్టి.. TRS ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోడలకు పోస్టర్లు అంటించి నిరసన తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com