అంత్యక్రియల చెక్కు ఇచ్చేందుకు కూడా అయిదు వేల లంచం అడిగాడు!

ఓ వ్యక్తి తల్లి అంత్యక్రియలకు మంజూరైన చెక్కును ఇచ్చేందుకు అధికారి లంచం డిమాండ్ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో మంగళవారం చోటుచేసుకుంది. హైదరాబాద్ మూసారాంబాగ్ కు చెందిన క్రాంతికుమార్ తల్లి ఇటీవల చనిపోయింది. అంత్యక్రియల నిమిత్తం ప్రభుత్వం నుంచి రూ.20 వేలు మంజూరయ్యాయి.
ఈ చెక్కు ఇచ్చేందుకు GHMC సర్కిల్-10 సూపరింటెండెంట్ వాద్యా పూల్ సింగ్ రూ.5 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ACBని ఆశ్రయించాడు.. అధికారి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో దొరికిపోయాడు.
ఆ అధికారిని అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కాగా దీనిపైన కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా తెలిపారు. ఇలాగే ఇంకా ఏ అధికారైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ కాంటాక్ట్ నంబరు 1064 కాల్ చేసి తెలపాల్సిందిగా సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com