జీహెచ్‌ఎంసి పరిధిలో ఎన్నికల నియమావళి.. పోస్టర్లు, బ్యానర్లను తొలగింపు

జీహెచ్‌ఎంసి పరిధిలో ఎన్నికల నియమావళి.. పోస్టర్లు, బ్యానర్లను తొలగింపు

జీహెచ్‌ఎంసి ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అత్యంత నిష్పక్ష పాతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని ఎన్నికల నోడల్ అధికారులను జీహెచ్ ఎంసీ కమిషనర్ డి.ఎస్ లోకేష్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు జీహెచ్ ఎంసి ఎన్నికల ఏర్పాట్లపై నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, రానున్న 15 రోజులు అత్యంత కీలకమన్నారు. ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎన్నికల నియమావళి అమలులోకివచ్చిన నేపథ్యంలో.. పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఎన్నికల నియమావళి అమలులోకివచ్చిన సందర్భంగా రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు. ఇతరప్రదేశాల్లో ఉన్న రాజకీయపార్టీలు,ప్రజా ప్రతినిధుల బ్యానర్లు, ప్లెక్సీలను తొలగించాలని ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా వచ్చే ఫిర్యాదులను, విజ్ఞాపనలను స్వీకరించేందుకు జీహెచ్ ఎంసి ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటుచేస్తామని కమిషనర్ లోకేష్ కుమార్ అన్నారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన 19వేల బ్యాలెట్ బాక్స్‌లను ఇప్పటికే చెక్‌చేసినట్లు తెలిపారు.

జీహెచ్‌ఎంసి పరిధిలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో... పోస్టర్లు, బ్యానర్లను తొలగించినట్లు కమిషనర్ లోకేష్‌ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావలి అమలుకు నోడల్ అధికారిగా ఎన్ ఫోర్స్ మెంట్, విజిలెన్స్ డైరెక్టర్‌ విశ్వజిత్ కంపాటిని ప్రత్యేకంగా నియమించినట్లు తెలిపారు. నగరంలోని వివిధ పార్టీలు ఏర్పాటుచేసిన ప్లెక్సీలను తొలగించేందుకు 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అయితే అధికారుల ఆదేశాల మేరకు నగరంలోనిపలు ప్రాంతాల్లో సిబ్బంది బ్యానర్లను, ప్లెక్సీలను తొలగింపు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story