తెలంగాణ

Ganesh Nimajjanam: గణేష్ నిమజ్జనంపై గందరగోళం.. హైకోర్టులో రివ్యూ పిటిషన్..

భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇందుకోసం నెలల క్రితమే ప్రణాళికలు సిద్ధమవుతాయి.

Ganesh Nimajjanam: గణేష్ నిమజ్జనంపై గందరగోళం.. హైకోర్టులో రివ్యూ పిటిషన్..
X

Ganesh Nimajjanam: భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇందుకోసం నెలల క్రితమే ప్రణాళికలుభాగ్యనగరంలో గణేష్ నిమజ్జనానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇందుకోసం నెలల క్రితమే ప్రణాళికలు ఏర్పాటు చేశాం. ఇప్పటికిప్పుడు వాటిని మార్చాలంటే సాధ్యమయ్యే పని కాదంటూ హైకోర్టుకు విన్నవించుకుంటోంది జీహెచ్‌ఎమ్‌సీ. పిఓపీ, కృత్రిమ రంగులతో తయారు చేసిన గణేషుడి విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేసి నీటిని కలుషితం చేయరాదంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ తీర్పును పున:పరిశీలించాలంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తీర్పులో ప్రధానంగా 4 అంశాలు తొలగించాలని కోరారు.. అవి..

హుస్సేన్ సాగర్, ఇతర జలాశయాల్లో పీఓపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయడం,

ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించడం,

కృత్రిమ రంగులు లేని విగ్రహాలనే అనుమతించాలన్న ఆంక్షలు తొలగించడం,

హుస్సేన్ సాగర్‌లో రబ్బరు డ్యాం నిర్మించాలన్న ఉత్తర్వులు సవరించడం

ట్యాంక్ బండ్ వైపు నిమజ్జనానికి అనుమతించకపోతే.. నగరంలోని అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తి కావడానికి 6 రోజులు పడుతుందని జీహెచ్‌ఎంసీ పిటిషన్‌లో పేర్కొంది. వ్యయ ప్రయాసలతో కూడిన రబ్బరు డ్యాం నిర్మాణం ఇప్పటికిప్పుడు పూర్తి కాదని, దానికి కొంత సమయం అవసరమని వివరించింది. నగర వ్యాప్తంగా వేల సంఖ్యలో భారీ విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాల సంఖ్యకు తగినన్ని నీటి కుంటలు లేవని స్పష్టం చేసింది. పెద్ద విగ్రహాలు నీటి కుంట్లలో నిమజ్జనం చేయడం సాధ్యం కాదని తెలిపింది.

అయినా ఇప్పటికే హుస్సేన్ సాగర్ వద్ద భారీ క్రేన్లు ఏర్పాటు చేశామని పేర్కొంది. ఇందుకోసం నెలల క్రితమే ప్రణాళికలు సిద్దం చేశాం. ఇప్పటికిప్పుడు వాటిని మార్చడం కష్టతరం.. ఇలా చేయడం వలన గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయని పేర్కొంది. నిమజ్జనం తర్వాత 24 గంటల్లో వ్యర్ధాలు తొలగిస్తామని జీహెచ్‌ఎంసీ కోర్టుకు వెల్లడించింది. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పింది. విగ్రహ నిమజ్జన కార్యక్రమం ఆపితే నిరసనలు చేపడతామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పిలుపునిచ్చిందని జీహెచ్‌ఎంసీ కోర్టుకు తెలిపింది.

కాగా, జీహెచ్‌ఎంసీ రివ్యూ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు. దీంతో లంచ్ మోషన్ విచారణకు హైకోర్టు అంగీకరించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు రివ్యూ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది.

Next Story

RELATED STORIES