Adilabad: వెంటపడి వేధిస్తున్న యువకుడికి తగిన శాస్తి.. అందరిముందే చెప్పుతో కొట్టి..
By - Divya Reddy |7 Jun 2022 2:30 PM GMT
Adilabad: వెంటపడి వేధిస్తున్న యువకుడికి తగిన శాస్తి చేసింది యువతి. చెప్పుతో చెంపలను వాయించేసింది.
Adilabad: వెంటపడి వేధిస్తున్న యువకుడికి తగిన శాస్తి చేసింది యువతి. చెప్పుతో చెంపలను వాయించేసింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా వారియర్ చెన్నూరి సందీప్ ఓ యువతిని షాపు వద్ద వేధిస్తూ దాడికి యత్నించాడు. దీంతో ఆమె ప్రతిఘటించింది. మరోసారి ఆ యువతి ఇంటి వద్దకు వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో యువతి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com