Bhadrachalam : భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం.. ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న అధికారులు..

Bhadrachalam : భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం.. ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న అధికారులు..
Bhadrachalam : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది.

Bhadrachalam : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతుంది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. భారీ వర్షాలకు ఎగువన ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి నదులు పొంగిపొర్లడంతో పాటు.. ప్రాజెక్టుల నుంచి లక్షల క్యూసెక్కుల నీరు గోదావరికి పోటెత్తింది. దీంతో భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చింది. నిన్న ఉదయం 36 అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి.. వేగంగా పెరుగుతూ 50 అడుగులకు పైగా చేరింది. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రానికి 55 అడుగులకు నీటిమట్టం చేరే అవకావం ఉందని అంచనా వేస్తున్నారు.

గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వాగులు, వంకలు దాటేందుకు ప్రయత్నించొద్దని కోరారు. పశువులను కూడా మేతకు వదలొద్దని.. జాలర్లు వేటకు వెళ్లొద్దని సూచించారు. ప్రాణనష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ అనుదీప్‌ ఆదేశాలు జారీ చేశారు. నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో చర్ల - వెంకటాపురం రూట్లలో బస్సులు నిలిపివేశారు ఆర్టీసీ అధికారులు.

గత నెలలో వచ్చిన వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ముంపు వాసులకు తాజాగా మరోసారి వరద ముంపు పొంచి ఉండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 10 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద పోటుతో గోదావరి లంక గ్రామాల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story