Bhadradri Godavari : భద్రాద్రిలో ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ

Bhadrachalam Godavari : భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. గంట గంటకు వరద ఉద్ధృతి వేగంగా పెరుగుతోంది. ఇప్పటికే 53 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తోంది. దీంతో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.
ఎగువన ఉన్న శ్రీరాంనగర్, కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్ట్ నుంచి భారీ స్థాయిలో నీటిని విడుదల చేయడంతో... భద్రాచలం వద్ద గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. 14 లక్షల 45వేల క్యూసెక్కుల వరద నీరు దిగివకు వెళ్తోంది. దీంతో గోదావరి పరివాహక, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
గోదావరి ఉగ్రరూపానికి...... భద్రాచలంలోని ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి చర్ల వెళ్లే రాష్ట్రీయ రహదారిపై వరద నీరు చేరడంతో.. దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి ఛత్తీస్‌ఘడ్, ఒడిశా వెళ్ల జాతీయ రహదారిపైనా వరద నీరు చేరింది.
వరద దాటికి వేల ఎకరాల్లో పత్తిపంట నీట మునిగింది. భద్రాచలం శివారు కాలనీ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీస్, కొత్తగూడెం్ జిల్లా కలెక్టరేట్‌లో వరద కంట్రోలు రూం ఏర్పాటు చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com