Telangana : గుడ్ న్యూస్.. రైతు బీమా కు మరో అవకాశం...

రాష్ట్ర రైతులకు తెలంగాణ ప్రభుత్వం కీలక అప్ డేట్ ఇచ్చింది. పట్టా పాసు బుక్ ఉండి....రైతు బీమా కు దరఖాస్తు చేసుకోని రైతులకు మరో అవకాశం కల్పించింది ప్రభుత్వం. తాజా సూచనల ప్రకారం.... జూన్ 5 వరకు పట్టా పాస్ బుక్ జారీ అయినప్పటికి ఇంత వరకు రైతు బీమా కు దరఖాస్తు చేసుకొని వారికి మరో అవకాశం కల్పించింది వ్యవసాయ శాఖ. దరఖాస్తు ఫారం, రైతు పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్, ఎమ్మార్వో డిజిటల్ సంతకం తో రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది. జూన్ 5 లోపు పాస్ బుక్ వచ్చిన రైతులు మాత్రమే దీనికి అర్హులుగా వ్యవసాయ శాఖ ప్రకటించింది. అలాగే అప్లై చేసుకునే రైతులు.. 1966 ఆగస్టు 14 నుండి 2007 ఆగస్టు 14 మధ్యలో పుట్టిన వారు.. అంటే .. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు ఉన్న వారు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ అధికారి నోటిఫికేషన్ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com