MMTS: ప్రయాణీకులకు ఎంఎంటీఎస్ గుడ్ న్యూస్..

MMTS: ప్రయాణీకులకు ఎంఎంటీఎస్ గుడ్ న్యూస్..
MMTS: అతి తక్కువ చార్జీలతో రవాణా సదుపాయాన్ని అందించే ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రయాణీకులు వినియోగించుకోవాలని ఇన్‌చార్జి జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కోరారు.

MMTS: ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా ప్రతి అరగంటకూ ఒక రైలు చొప్పున అందుబాటులోకి రానుంది. మొదట్లో కోవిడ్ కారణంగా ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేశారు. ఆ తర్వాత పునరుద్ధరించినప్పటికీ ప్రయాణీకుల ఆదరణ లేకపోవడంతో సర్వీసులు రద్దయ్యాయి. కొద్ది రోజులుగా ప్రయాణీకుల రద్దీ పెరగడంతో సర్వీసులను పెంచారు.

ఐటీ ఉద్యోగులు కూడా ఆఫీసులకు వెళ్లడంతో హైటెక్ సీటీ వైపు రద్దీ పెరిగింది. ప్రయాణీకుల డిమాండ్ మేరకు సర్వీసులను పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అతి తక్కువ చార్జీలతో రవాణా సదుపాయాన్ని అందించే ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రయాణీకులు వినియోగించుకోవాలని ఇన్‌చార్జి జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కోరారు.

ఎంఎంటీఎస్ రైళ్ల సమయపాలనను కూడా పునరుద్ధరించారు. ఇక నుంచి తెల్లవారు జామున 4.30 గంటల నుంచి అర్థరాత్రి 12.30 గంటల వరకు రైళ్లు నడుస్తాయి. ప్రస్తుతం ప్రతి రోజు 86 సర్వీసులు నడుస్తున్నాయి. ఫలక్ నుమా నుంచి సికింద్రాబాద్ వరకు, నాంపల్లి నుంచి లింగపల్లి వరకు, లింగంపల్లి మీదుగా తెల్లాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు 29 రైల్వే స్టేషన్లను కవర్ చేస్తూ 50 కిలోమీటర్లకు పైగా సర్వీసులు విస్తరించారు.

చార్జీలు తక్కువ..

ఫ్లాట్ ఫాం చార్జీల కంటే తక్కువ చార్జీలు ఉంటాయి ఎంఎంటీస్ రైల్లో. బస్సులు, ఆటోలు, క్యాబ్ లు వంటి వాటితో పోల్చుకుంటే ఈ రైళ్లలో చార్జీలు తక్కువగా ఉంటాయి. ఈ సదుపాయాన్ని ప్రతి ప్రయాణీకుడు ఉపయోగించుకోవాలని జనరల్ మేనేజర్ కోరారు. టికెట్ బుకింగ్ కౌంటర్లతో పాటు ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లు, యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా కూడా టికెట్లను తీసుకోవచ్చని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story