Omicron: గల్ఫ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్.. గ్రామంలో సెల్ఫ్‌ లాక్‌‌డౌన్‌..

Omicron: గల్ఫ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్.. గ్రామంలో సెల్ఫ్‌ లాక్‌‌డౌన్‌..
Omicron: బాధితుణ్ని హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నారు..

Omicron: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్‌ కేసు వెలుగు చూడటంతో గ్రామం మొత్తం సెల్ఫ్‌ లాక్‌ డౌన్‌లోకి వెళ్లింది.. ఇటీవల దుబాయ్‌ నుంచి చంద్రం అనే వ్యక్తి స్వగ్రామానికి వచ్చాడు.. అయితే, అతనికి టెస్టుల్లో ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది.. దీంతో బాధితుణ్ని హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నారు..

అటు బాధితుడి కుటుంబ సభ్యులకు కూడా టెస్టులు నిర్వహించారు వైద్యులు.. ఆయన భార్య, తల్లికి కరోనా పాజిటివ్‌ తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.. వైరస్‌ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు.. ఆందోళన చెందాల్సిన పని లేదని.. మాస్కులు, శానిటైజర్లు విధిగా వాడాలని ప్రజలకు సూచిస్తున్నారు..

మరోవైపు గ్రామంలో ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూడటంతో హోటళ్లు, కిరాణా షాపులు మూతపడ్డాయి.. జనసంచారం లేకపోవడంతో రోడ్లు కూడా నిర్మానుష్యంగా మారాయి.. అటు గ్రామంలో 64 మంది నుంచి శాంపిళ్లు సేకరించి టెస్టులకు పంపారు అధికారులు. గూడెం గ్రామంలో పది రోజులపాటు సెల్ఫ్‌ లాక్‌ డౌన్‌ విధిస్తూ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. దీంతో గూడెం గ్రామంలో జన సంచారం తగ్గింది.

Tags

Read MoreRead Less
Next Story