TG: తల్లితో సహ జీవనం.. కూతుళ్లపై రేప్.. అతడికి ఎయిడ్స్

అందరికీ మార్గ నిర్దేశనం చేయాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పాడు. భార్య చనిపోవడంతో ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. తల్లి లేని సమయంలో ఆమె ఇద్దరు కూతుళ్లపైనా అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా ఆ కామాంధుడికి హెచ్ఐవీ పాజిటివ్ రావటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ దారుణం జరిగింది. తమపై అత్యాచారం చేశాడని ఇద్దరు అమ్మాయిలు తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త చనిపోయిన తర్వాత ఈ సార్ కు ఓ మహిళతో పరిచయమైంది. అప్పటి నుంచి ఆమెతో సహజీవనంలో ఉంటున్నాడు. ఈ మహిళకు 19 ఏళ్లు, 15 ఏళ్లు ఉన్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లి లేని సమయంలో వీరిద్దరిపైనా గత రెండేండ్లుగా ఆ ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడుతున్నట్లు తెలిసింది. ఈ విషయం తల్లికి చెప్తే చంపేస్తానని బెదిరించటంతో ఈ బాలికలు మౌనంగా ఉండిపోయారు. ఇటీవల ఆ కామాంంధుడికి హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయం తెలియడంతో తమను రేప్ చేశాడని ఇద్దరు అమ్మాయిలు తల్లికి చెప్పారు. మహిళ ఫిర్యాదుతో అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
అత్యాచారం కేసులో ఉపాధ్యాయుడికి రిమాండ్
9వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం చేసిన ఘటన వికారాబాద్ జిల్లాలో కలకలం రేపింది. వికారాబాద్ మండలం బురంతపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిపై ఫోక్ యాక్ట్ లో కేసు నమోదు చేసిన పోలీసులు. జంగయ్య అనే వ్యక్తి ను పోలీసులు కోర్ట్ లో హాజరు పరిచి రిమాండుకు తరలించారు. బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.
బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం
తెలుగు రాష్ట్రాల్లో వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు. లైంగికదాడి చేస్తున్న సమయంలోనే వీడియో తీసిన యువకుడు... ఆ వీడియోతో యువతిని బెదిరించాడు. వేధింపులు పెరగడంతో యువతి తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com