Governor Tamilisai : రాష్ట్రంలో ఏం జరుగుతుంతో ప్రజలు గమనిస్తున్నారు....

రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు గవర్నర్ తమిళిసై. పుదుచ్చేరిలో మాట్లాడిన గవర్నర్... రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.
"ప్రజల మధ్య గణతంత్ర వేడుకలు జరగకుండా చేయాలని ప్రయత్నించారు. ఓ వ్యక్తి హైకోర్టుకు వెళ్లడంతో రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని కోర్టు ఆదేశించింది. గణతంత్ర వేడుకలను జరపాలని రెండునెలల క్రితమే ప్రభుత్వానికి లేఖ రాశాను. దాన్ని పట్టించుకోకుండా రాజ్ భవన్ లోనే వేడుకలను జరుపుకోవాలని రెండురోజుల క్రితం సమాచారం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. గణతంత్ర వేడుకలను ప్రజల మధ్య జరుపుకోవడం సంతోషాన్నిచ్చింది " అని గవర్నర్ తమిళిసై తెలిపారు.
రాజ్‌భవన్‌లో జరిగిన 74వ గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై జాతీయ జెండా ఎగురవేశారు. రాష్ట్ర అభివృద్ధి, పథకాల అమలు కోసం ప్రభుత్వాన్ని గైడ్ చేయడం తన బాధ్యతని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. తెలంగాణతో నా బంధం మూడేళ్లుగా కాదు.. పుట్టుకతోనే ఉందని తెలిపారు. తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని, హక్కులను కాపాడుకుందామని స్పష్టం చేశారు. రాజ్‌భవన్ లో జరిగిన వేడుకలకు సీఎం కేసీఆర్, మంత్రులు హాజరు కాలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com