Governor Tamilisai : రాజ్ భవన్ విజయం సాధించింది

రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన న్యాయ పోరాటంలో రాజ్ భవన్ విజయం సాధించిందని తెలిపారు గవర్నర్ తమిళిసై. ఫిబ్రవరి 3న అసెంబ్లీలో ప్రసంగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ను ఆహ్వానించింది. ఈ విషయంపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ఇది ప్రభుత్వంపై రాజ్ భవన్ సాధించిన విజయమని పేర్కొన్నారు. ఫిబ్రవరి 3న అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
అసెంబ్లీ ప్రోరోగ్ కాకపోవడంతో... గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలుపకపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగ విధానాలలో న్యాయవ్యవస్థ ఎలా జ్యోక్యం చేసుకుంటుందని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వం తరపున మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అధికారులు రాజ్ భవన్ క వెళ్లి గవర్నర్ తో చర్చలు జరిపారు. ఇందుకుగాను.. గవర్నర్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com