Tamilisai Soundararajan : మెడికల్‌ పీజీ సీట్ల బ్లాక్ దందాపై గవర్నర్‌ ఆగ్రహం

Tamilisai Soundararajan : మెడికల్‌ పీజీ సీట్ల బ్లాక్ దందాపై గవర్నర్‌ ఆగ్రహం
Tamilisai Soundararajan : తెలంగాణలో మెడికల్‌ పీజీ సీట్ల బ్లాక్ దందాపై గవర్నర్‌ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tamilisai Soundararajan : తెలంగాణలో మెడికల్‌ పీజీ సీట్ల బ్లాక్ దందాపై గవర్నర్‌ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని.. కాళోజీ వర్సిటీ వీసీని గవర్నర్‌ తమిళిసై ఆదేశించారు.

తెలంగాణాలో మెడికల్ పీజీ సీట్ల బ్లాక్ బాగోతాన్ని ముందుగా హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసేసరికి.. ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మెడికల్ పీజీ భర్తీ దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల ద్వారా జరుగుతుంది. ఈ పరీక్షలో మంచి ర్యాంకు సాధించిన వాళ్ళే ఈ సీట్ బ్లాక్ దందాకు పెట్టుబడి. మంచి ర్యాంక్‌ సాధించిన వాళ్ళు దేశవ్యాప్తంగా జరిగే కౌన్సిలింగ్‌లో వారి ర్యాంక్‌ ఆధారంగా ఫ్రీ సీటు పొందుతారు.

ఆ తర్వాత అన్ని రాష్ట్రాల్లో జరిగే మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ ఒక్కసారి కాకుండా.. ఆయా రాష్ట్రాలు వాళ్లకు అనుకూలంగా ఉన్న తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తాయి. అయితే మంచి ర్యాంక్ సాధించి ఫ్రీ సీట్లు పొందిన వ్యక్తులు.. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో జరిగే బి కేటగిరి కౌన్సిలింగ్‌కు హాజరవుతారు. మంచి ర్యాంక్‌ ఉంది కాబట్టి ఆటోమేటిక్‌గా వాళ్లకు సీట్ వస్తుంది. కౌన్సిలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు తమ కాలేజీల్లో ఫీజులు కట్టినట్లు కూడా ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు నిర్ధారిస్తాయి. రెండు మూడు దఫాలుగా నడిచే టాప్ అప్ కౌన్సెలింగ్ రౌండ్లు కూడా పూర్తి అయ్యే వరకు కాలేజీలు సైలెంట్‌గా ఉంటాయి.

ఇక ఎలాంటి కౌన్సెలింగ్ లేదు అని నిర్ధారణకు వచ్చిన తర్వాత సదరు కాలేజీల యాజమాన్యాలు తమ దగ్గర బి కేటగిరీలో డబ్బులు కట్టిన విద్యార్థులు జాయిన్ కావడం లేదనే సమాచారం యూనివర్సిటీకి చేరవేస్తారు. నిబంధనల ప్రకారం ఇలా ఖాళీగా మిగిలిన సీట్లు నింపుకునే స్వేచ్ఛ తమకు ఉంది కాబట్టి.. ఆ మిగిలిన సీట్లను నింపుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరడం అనుమతి పొందడం జరిగిపోతాయి. ఈ సీట్లను బ్రాంచీలకున్న క్రేజ్‌ని బట్టి 2 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలకు అమ్మేసుకుంటారు.

అయితే మెరిట్ స్టూడెంట్స్‌ను ప్రైవేటు కళాశాలలకు సమకూర్చేందుకు ఒక బిహారీ ముఠా పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పీజీ మెడికల్ మాత్రమే కాకుండా ఎం.బీ.బీ.ఎస్ సీట్లలో కూడా ఇలాగే జరుగుతున్నదని దీనిపై ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరపాలని ఓయూ జెఏసీ డీజీపీకి ఫిర్యాదు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story