Tamilisai Soundararajan : గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేపథ్యం ఇదే..!

Tamilisai Soundararajan : తెలంగాణ రాష్ట్రానికి రెండవ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్... తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ కూడా.. తమిళనాడుకు చెందిన తమిళిసై.. 1961 జూన్ 2న కృష్ణకుమారి, కుమార్ అనంతన్ దంపతులకు జన్మించారు..వీరిది కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ ప్రాంతం.. ఈమె తండ్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు.. ఎంపీగా కూడా పనిచేశారు.
ఎంబీబీఎస్ విద్యను చెన్నైలోని మద్రాస్ మెడికల్ విశ్వవిద్యాలయంలో అభ్యసించిన తమిళిసైకి వసంత్‌కుమార్ అనే సోదరుడు ఉన్నాడు. తమిళసై, సౌందరరాజన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.. ఆమె భర్త సౌందరరాజన్ కూడా వైద్యుడే.. చిన్నతనం నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి ఉండడంతో తమిళిసై వైద్య కళాశాలలో చదువుతుండగానే విద్యార్థి సంఘం నాయకురాలిగా పనిచేశారు.
తండ్రి కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ఆమె మాత్రం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల వైపు ఆకర్షితులై ఆ పార్టీలో చేరారు.. 2007లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, 2010లో తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షురాలిగా, 2013లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 2014వ సంవత్సరం నుంచి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు.. ఇక 2006, 2011లో రెండుసార్లు శాసనసభ సభ్యురాలిగా, 2009, 2019లో రెండుసార్లు లోక్ సభ సభ్యురాలిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు.
2019 సెప్టెంబర్ 8న తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్‌గా భాద్యతలు చేపట్టిన తమిళిసైకి కేంద్రపాలిత రాష్ట్రమైన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఫిబ్రవరి 2021లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.. ఇక తమిళిసైకి ఇద్దరు పిల్లలున్నారు.. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి.. వీరిద్దరూ కూడా డాక్టర్లు కావడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com