Revanth Reddy: ఎన్ని కష్టాలున్నా.. ఆరు గ్యారంటీల అమలు చేస్తామన్న తెలంగాణ సిఎం

సహా విపక్ష పార్టీలు ఎన్నితప్పుడు ప్రచారాలు చేసినా ఆరు గ్యారెంటీలను అమలుచేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాల్లో భాగంగా.. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను రేవంత్ ప్రారంభించారు. సోనియాగాంధీ ఇచ్చిన మాటే శిలాశాసనంగా ఆరుగ్యారెంటీలు అమలుచేసి తెలంగాణను దేశానికి ఓ నమూనాగా నిలుపుతామని రేవంత్ స్పష్టం చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన ఆరుగ్యారెంటీల్లో భాగంగా కాంగ్రెస్ సర్కార్ మరో రెండు హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500రూపాయలకే గ్యాస్‌సిలెండర్, గృహజ్యోతి పథకంలో భాగంగా 200యూనిట్ల వరకు విద్యుత్ సరఫరాను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు. చేవెళ్లలో లక్ష మంది మహిళల సమక్షంలో పథకాలు ప్రారంభించాలని భావించినప్పటికీ.... ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల సచివాలయానికి మార్చినట్లు తెలిపారు. UPA సర్కార్ 400రూపాయలకు అందించిన సిలెండర్‌ను భాజపా సర్కార్ 1200కు పెంచిందని విమర్శించారు. పేదలకు సిలిండర్ భారం తగ్గించాలని 500కే అందిస్తున్నట్లు తెలిపారు. భారాస సహా విపక్షాలు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా..ఆర్థిక నియంత్రణ పాటిస్తూ. ఆరు గ్యారంటీలు అమలుచేసి తీరుతామని పునరుద్ఘాటించారు. 40 లక్షల కుటుంబాల గ్యాస్ సిలిండర్ పథకంతో లబ్ధి కలుగుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. లోపాలు గుర్తించి పథకంలో మార్పులు చేసుకుంటూ వెళ్తామన్నారు. రాష్ట్రంలో అర్హులైన అందరికీ ఉచిత కరెంటు ఇస్తామని.... 200లోపు యూనిట్లు వాడే అందరికీ మార్చిలో జీరో బిల్లు వస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.. అనంతరం ఐదుగురు మహాలక్ష్మి, గృహజ్యోతి లబ్ధిదారులకు 500 రూపాయలకే సిలిండర్ సహా జీరో కరెంట్ బిల్లు నమూనాలు అందించారు.
ఇంటి కనెక్షన్ నంబర్, తెల్ల రేషన్‌కార్డు, ఆధార్‌కార్డును జతచేసి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిని ఈ పద్ధకాలలో లబ్ధిదారులుగా గుర్తిస్తారు. గ్యాస్ కనెక్షన్ నంబర్, బ్యాంకుఖాతాలు, ఆధార్‌నెంబర్, ఆహారభద్రతా కార్డు నంబర్లను పరిశీలించి, వాటిని సమర్పించిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారు. మహాలక్ష్మి లబ్ధిదారులు మొత్తం సిలిండర్ ధర చెల్లించి రీఫిల్ సిలిండర్‌ను తీసుకోవలసి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ కంపెనీలకు సబ్సిడీ సొమ్మును జమ చేస్తుంది. మార్కెటింగ్ కంపెనీలు లబ్ధిదారులు మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకున్న తర్వాత సబ్సిడీని వారి ఖాతాల్లోకి జమచేస్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com