GROUP 1: గ్రూప్ 1పై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం

తెలంగాణలో గ్రూపు-1 నియమకాలపై అప్పీల్‌కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయనుంది. వారం రోజుల్లో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. గ్రూప్-1 పరీక్షల్లో ఇప్పటివరకు జరిగిన ప్రక్రియలను వివరించాలని భావిస్తున్నది. ఈ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై పలువురు న్యాయ నిపుణలతో మాట్లాడిన్నట్టు తెలిసింది. గ్రూపు-1 నియామకాల్లో ఎలాంటి లోపాలు లేవని టీజీపీఎస్సీ మరోసారి స్పష్టం చేసింది.
"నిరుద్యోగుల గొంతు కోసిన ప్రభుత్వం"
తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష రద్దు, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల నమ్మకాన్ని వమ్ము చేసిందని ఆయన ఎక్స్ వేదికగా ఆరోపించారు. “సర్కారు కొలువుకోసం ఏళ్ల తరబడి కష్టపడి, తమ విలువైన సమయాన్నీ, అమ్మానాన్నల కష్టార్జితాన్నీ ధారపోసి పోటీ పరీక్షలు రాసే తెలంగాణ యువత నమ్మకాన్ని ఈ కాంగ్రెస్ సర్కార్ వమ్ము చేసింది” అని కేటీఆర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత, కాసుల కక్కుర్తి కలగలిసి అనేక అవకతవకలకు కారణమయ్యాయని, “అంగట్లో కొలువులు అమ్ముకొని నిరుద్యోగుల గొంతుకోసింది” అని ఆయన విమర్శించారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో విఫలమైన ఈ ప్రభుత్వాన్ని యువత ఎన్నటికీ క్షమించదని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన రెండు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం గ్రూప్-1 పరీక్షను మళ్ళీ నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com