GROUP 2: గ్రూప్‌ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు

GROUP 2: గ్రూప్‌ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు
X

గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా ఓ అభ్యర్థికి గుండెపోటు రాగా.. వెంటనే స్పందించిన ఎస్సై అతన్ని ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు కాపాడారు. మరో గంటలో పరీక్ష ముగుస్తుందనగా ఈ ఘటన జరిగింది. పటాన్‌చెరు పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో.. సంగారెడ్డి జిల్లా పుల్కల్ గ్రామం లక్ష్మీనగర్‌కు చెందిన ఎల్.నగేశ్ గ్రూప్ 2 పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం నాలుగో పేపర్ పరీక్ష రాస్తుండగా అతనికి గుండెపోటు వచ్చింది. దీంతో నిర్వహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పరీక్షా కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తోన్న ఎస్సై ఆసిఫ్ వెంటనే స్పందించారు. మూడో అంతస్తులో ఉన్న నగేశ్‌ను భుజంపై మోసుకుంటూ కిందకు తీసుకొచ్చి.. వాహనంలో ఎక్కించుకుని పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. దీంతో బాధితుడికి ప్రాణాపాయం తప్పింది.

Tags

Next Story