Group-2 Exam : షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-2, క్లారిటీ ఇచ్చిన కేసీఆర్

గ్రూప్-2 పరీక్ష తేదీలకు సంబంధించి సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా స్పష్టతనిచ్చారు. అనుకున్న తేదీల్లోనే పరీక్ష యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించారు. అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతిపై అనే అంశంపై చర్చ సందర్భంగా కేసీఆర్ ఈ విషయంపై స్పందించారు.. రిక్రూట్‌మెంట్ దశలవారీగా చేయాలని ముందే చెప్పామని తెలిపారు. ఒక అభ్యర్థి ఎక్కువ పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచనలు కూడా గతంలోనే ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో తాను ఇంతకుముందే మాట్లాడానని.. ఇప్పటికే ప్రకటించిన పరీక్షలను రద్దు చేయడం సరికాదని భావిస్తున్నామన్నారు. గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వాటిని మార్చేందుకు వీలుకాదని స్పష్టం చేశారు.
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షను ఈ నెల 29,30 తేదీల్లో నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రకటన కూడా ముందుగానే విడుదల అయింది. అయితే ఆగస్టు 23వ తేదీ వరకు గురుకులం పరీక్షలు, సెప్టెంబర్ 12వ తేదీ నుంచి జూనియర్ లెక్చరర్ పరీక్షలు ఉండటంతో.. గ్రూప్-2 పరీక్షలకు సిద్దం కావడానికి సమయం లేదని, పరీక్షను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు వాపోయారు. అయితే చాలా కాలంగా గ్రూప్-2 పరీక్షకు సిద్దమవుతున్న కొందరు అభ్యర్థులు మాత్రం.. పరీక్షలను వాయిదా వేయవద్దని కోరుతున్నారు. అటు అసెంబ్లీ సమావేశాల్లో కూడా పలువురు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో కేసీఆర్ ఈ ప్రకటన చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com