హైదరాబాద్‌కు క్షేమంగా చేరుకున్న గల్ఫ్ బాధితుడు..!

హైదరాబాద్‌కు క్షేమంగా చేరుకున్న గల్ఫ్ బాధితుడు..!
గల్ఫ్ జైలులో చిక్కుకున్న జగిత్యాల వాసి క్షేమంగా హైదరాబాద్‌కు చేరుకున్నాడు. కథలాపూర్‌కు చెందిన పిట్టల కొండగట్టు బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లాడు.

గల్ఫ్ జైలులో చిక్కుకున్న జగిత్యాల వాసి క్షేమంగా హైదరాబాద్‌కు చేరుకున్నాడు. కథలాపూర్‌కు చెందిన పిట్టల కొండగట్టు బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. అయితే తప్పుడు కేసుల్లో ఇరుక్కున్న అతడిని అక్కడి పోలీసు అధికారులు జైలుకు పంపారు. దీంతో కొండగట్టు కుటుంబం కన్నీరుమున్నీరయింది. తన భర్తను గల్ఫ్ జైలు నుంచి విడిపించి స్వస్థలానికి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని కొండగట్టు భార్య, అతని తల్లిదండ్రులు తెలంగాణ ప్రభుత్వం, గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘాన్ని కోరారు. దుబాబ్ ఎంబసీ అధికారులతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. తెలంగాణ సర్కారు విజ్ఞప్తితో గల్ఫ్ జైలు నుంచి పిట్టల కొండగట్టును దుబాయ్ అధికారులు విడుదల చేశారు.

Tags

Next Story