హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. భారీగా డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. కండరాల బలం కోసం స్డెరాయిడ్స్‌ అమ్ముతున్న ఫిట్నెస్ ట్రైనర్ జుబేర్‌ సహా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్‌లోని A1 సప్లిమెంట్‌ స్టోర్స్‌ పేరుతో.. జుబేర్ స్టెరాయిడ్లు అమ్మేవాడు. పక్కా సమాచారంతో రెయిడ్‌ చేసిన పోలీసులు.. ఇద్దరినీ పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 14 లక్షల రూపాయల విలువ చేసే స్టెరాయిడ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. గతంలో మిస్టర్‌ ఇండియా, మిస్టర్ వరల్డ్‌ పోటీల్లో పాల్గొన్న జుబేర్‌.. విదేశాల నుంచి స్టెరాయిడ్స్‌ తెప్పించి.. ఇక్కడి యువతకు అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు.


Tags

Next Story