TS EAMCET 2022: ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ అభ్యర్థులకు మళ్లీ హాల్‌టికెట్లు..

X
TS EAMCET 2022: గతంలో భారీ వర్షాల కారణంగా వాయిదా పడి తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలను.. ఈ నెల 30, 31 వ తేదీల్లో నిర్వహించేందుకు.. ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించారు. ఈ మేరకు 90 పరీక్ష కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పరీక్ష కేంద్రాలతోపాటు తేదీలు మారే అవకాశం ఉన్నందున మరోసారి విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. అటు కొత్త హల్ టికెట్లు ఈనెల 27 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలను ఉదయం, సాయంత్రం చొప్పున రెండు సెషన్స్‌ల్లో నిర్వహించనున్నారు. వాస్తవానికి ఈ నెల 14, 15 తేదీల్లోనే ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలు జరగాల్సి ఉండగా.. కుండపోత వానలతో పరీక్షలు వాయిదా పడ్డాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
