SHIBHAYATRA: కమనీయం.. హనుమాన్ శోభాయాత్ర
హనుమాన్ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శోభాయాత్రలు శోభనీయంగా సాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు, రాజకీయ నాయకులు, యువకులు ర్యాలీలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానంగా హైదరాబాద్‌లో నిర్వహించిన శోభాయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గౌలిగూడలోని రామ్ మందిర్ నుంచి కోఠి, నారాయణగూడ బైపాస్ మీదుగా సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు 12 కిలోమీటర్ల మేర యాత్రను సాగించారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. కాగా, ఈ యాత్ర ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు చేరుకోగానే ముస్లింలు భారీ ఎత్తున తరలి వచ్చి స్వాగతం పలికారు. పూలు చల్లుతూ జై శ్రీ రామ్ నినాదాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ఎంపీ ఈటల రాజేందర్, నాయకులు, భక్తులు భారీగా తరలివచ్చి భాగమయ్యారు. గౌలిగూడ నుంచి కోఠి, నారాయణగూడ బైపాస్ మీదుగా సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు ఈ ర్యాలీ సాగింది. ఎంపీ ఈటల రాజేందర్, నాయకులు, భక్తులు భారీగా తరలివచ్చి పాల్గొన్నారు.
కిటకిటలాడిన కొండగట్టు
మరోవైపు హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు కాలి నడకన కిలోమీటర్ల దూరం నుండి అంజన్నను దర్శనం చేసుకోవటానికి వచ్చారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు కొండగట్టు ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com