Harish Rao: 10వ తరగతి పిల్లలకు ఫోన్లు ఇవ్వకండి... మంత్రి సలహా

తెలంగాణ వైద్యారోగ్య, ఆర్థిక మంత్రి హరీష్‌రావు బుధవారం సిద్దిపేట జిల్లా ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతి విద్యార్థుల తల్లితండ్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తమ పిల్లలను చదువు పట్ట ఉత్సాహ పరచడానికి సమయం కేటాయించాలని, వారిని సెల్‌ఫోన్‌లకు దూరంగా ఉంచాలని సూచించారు.
పదికి పది జీపీఏ వచ్చిన విద్యార్థులకు రూ.10000 బహుమానం ఇస్తానని, 100 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలకు రూ.25000 ఇస్తానని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని పాఠశాలల హెడ్‌మాస్టర్లతో సిద్దిపేట కలక్టరేట్‌లో ఆయన సమావేశమయ్యారు. 100శాతం ఉత్తీర్ణత సాధించడానికి కావల్సిన చర్యలన్నీ చేయాలని ఆదేశించారు.
తెలంగాణ ఏర్పడ్డ తరువాత సిద్దిపేట జిల్లా 10వ తరగతి ఉత్తీర్ణతలో 5వ స్థానంలో నిలిచిందని, పోయిన ఏడు మొదటి స్థానంలో నిలిచిందని, అందుకోసం కృషి చేసిన ప్రతి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సారి కూడా సిద్దిపేట మొదటి స్థానంలో నిలవాలని దాని కోసం ప్రతి ఒక్కరు కష్టపడాలని సూచించారు.
అలాగే ప్రభుత్వ పాఠశాలల మెరుగుదలకు యువత భాద్యత వహించాలని, సరైన పాలకులను ఎన్నకోవాలన్నారు. ఈ రోజుల్లో పిల్లలు సెల్‌ఫోన్‌లకు బాగా ఆకర్షిలౌతున్నారని, వారిని ఫోన్లకు దూరంగా ఉండేలా తల్లితండ్రు జాగ్రత్త తీసుకోవాలని హరీష్‌రావు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com