బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి మంత్రి హరీష్ రావు సవాల్

ఎన్నికలు వస్తుంటాయ్... పోతుంటాయని, వాటికోసం అబద్దాలు ప్రచారం చేయడం సరైంది కాదన్నారు మంత్రి హరీష్ రావు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ శ్రేణులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.
రాజకీయాల్లో గెలుపు- ఓటములు సహాజమన్న మంత్రి... అసత్యప్రచారం ప్రజాస్వామ్యంలో మంచింది కాదన్నారు.
గతంలో టీఆర్ ఎస్ గద్దెను ధ్వంసంచేసిన ఘటనను.. ఇప్పుడు దుబ్బాకలో జరిగినట్లు ప్రచారం చేయడంపై ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చేశామన్నారు. తప్పుడు ప్రచారానికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
మోదీ ప్రభుత్వం బీడికార్మికులకు 16వందలు ఇస్తుందని బీజేపీ నాయకులు అబద్దాలు చెపుతున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. గుజరాత్‌లో వృద్దాప్య ఫించన్ కేవలం 5వందలు రూపాయలే ఇస్తున్నారన్నారు. నిజంగా బీజేపీ ప్రభుత్వం 16వందలు ఇస్తుందంటే.. దుబ్బాక బస్టాండ్ వద్ద చర్చకు సిద్దమన్నారు. దీనిపై చర్చించేందుకు రావాలంటూ మంత్రి.. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి సవాల్ విసిరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com