Harish Rao : గుజరాత్ సీఎంగా మోడీ ఉన్నప్పుడు ఆ పని చేశారా : హరీష్ రావు

Harish Rao : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి హరీష్‌రావు ఖండించారు.. కేంద్రం నిధులు వినియోగిస్తే మోదీ ఫొటో పెట్టాల్సిందేనని నిర్మలా సీతారామన్ మాట్లాడటంలో ఔచిత్యం లేదన్నారు.. ఎన్డీయే హయాంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్న సమయంలో గుజరాత్ సీఎంగా మోదీ ఎప్పుడైనా రేషన్ షాపులో మన్మోహన్ ఫొటో పెట్టారా అని ప్రశ్నించారు.
ఆనాడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్టారా అని నిలదీశారు.. ఇలా ప్రజలెన్నుకున్న ప్రజా ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలపై ఇలాంటి ఒత్తిడి తేవడం ఎంత వరకు సమంజసమంటూ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు హరీష్‌రావు.. కేంద్ర పథకాల్లో నిధుల వాటా తగ్గించి రాష్ట్రాల వాటా పెంచారని.. కొన్ని పథకాల లక్ష్యాలు రాష్ట్రాల ప్రయోజనాలకు తగినట్లుగా లేవని విమర్శించారు. అనవసరమైన పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాల వాటా పెంచి మాపై భారం వేయడం మినహా కేంద్రం రాష్ట్రాలకు చేసిన మేలేంటని హరీష్‌రావు ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com