Harish Rao: కేంద్రమంత్రికి మంత్రి హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్..

Harish Rao (tv5news.in)
Harish Rao: ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.. తప్పంతా కేంద్రానిదేనని రాష్ట్ర ప్రభుత్వం అంటుంటే.. ఇటు టీఆర్‌ఎస్‌పై విమర్శలతో విరుచుకుపడుతోంది బీజేపీ.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు..
మంత్రులు పనిలేక వచ్చారా అంటూ నిన్న పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పడుతున్నారు.. అటు కేంద్రంపై, ఇటు బీజేపీపై కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.. మా మంత్రులను అవమానించే హక్కు మీకు ఎక్కడిదంటూ హరీష్‌రావు గట్టిగానే నిలదీశారు.. పీయూష్ గోయల్ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
పార్లమెంటు సాక్షిగా కేంద్రం పచ్చి అబద్ధాలు మాట్లాడుతోందని మంత్రి హరీష్‌రావు ఫైరయ్యారు.. చిల్లర ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరన్నారు.. రైతులతో రాజకీయాలు అవసరమా అంటూ కేంద్రాన్ని నిలదీశారు హరీష్‌రావు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com