కర్నాటక బీదర్‌ జిల్లాలోని గ్రామస్థులతో ముచ్చటించిన హరీశ్‌రావు

కర్నాటక బీదర్‌ జిల్లాలోని  గ్రామస్థులతో ముచ్చటించిన హరీశ్‌రావు
సంగారెడ్డి జిల్లా కర్సిగుత్తిలో గిరిజన బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాల ప్రారంభోత్సవానికి వెళ్తూ... మార్గమధ్యలోని బీదర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో ఆగారు.

కర్నాటక బీదర్‌ జిల్లాలోని ఓ గ్రామస్థులతో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ముచ్చటించారు. సంగారెడ్డి జిల్లా కర్సిగుత్తిలో గిరిజన బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాల ప్రారంభోత్సవానికి వెళ్తూ... మార్గమధ్యలోని బీదర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో ఆగారు. రోడ్డు పక్కన ఉన్న కొందరితో మాట్లాడారు. కర్నాటక రాష్ట్రంలో పథకాల గురించి ఆరా తీశారు. తెలంగాణలో పథకాల గురించి తెలుసా అని అడిగారు. నారాయణఖేడ్‌ జిల్లాలో తమ బంధువులు ఉన్నారని.... వాళ్లకు మంచి సంక్షేమ పథకాలు అందుతున్నాయని గ్రామస్థులు చెప్పారు. తాగు, సాగు నీరు, విద్యుత్‌, ఫించన్‌లు సహా సంక్షేమ పథకాలన్నీ కూడా తెలంగాణలోనే మెరుగ్గా ఉన్నాయని ప్రశంసించారు.

Tags

Read MoreRead Less
Next Story